Kavitha: బీఆర్ఎస్ కు ఎక్స్ వేదికగా కవిత కౌంటర్

Kavitha Counters BRS on X Platform
  • బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత
  • హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు
  • తెలంగాణ కోసం ఇంతకు వందరెట్లు ఎక్కువ భరిస్తానని ట్వీట్
మాజీ మంత్రి హరీశ్ రావుపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు కవిత కౌంటర్ ఇచ్చింది. నిజం మాట్లాడినందుకు ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తే.. తెలంగాణ ప్రజల కోసం ఇంతకు వందరెట్లు ఎక్కువైనా భరిస్తా అని ఆమె ఎక్స్ వేదికగా బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చారు. 'సత్యమేవ జయతే... జై తెలంగాణ' అని ట్వీట్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జాగృతి కార్యాలయంలో ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. హరీశ్, సంతోష్ రావులు మేకవన్నె పులులు అని విమర్శించారు. తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, బీఆర్ఎస్ పార్టీని చేజిక్కించుకునే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు తనకు జరిగింది రేపు కేసీఆర్, కేటీఆర్ కు కూడా జరుగుతుందని అన్నారు. 

Kavitha
Kalvakuntla Kavitha
BRS Party
Harish Rao
Kaleshwaram Project
Telangana Politics
KCR
KTR
BRS Crisis

More Telugu News