భారత్ సుంకాలు విధిస్తూ చంపేస్తోంది: ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
- చైనా, బ్రెజిల్ కూడా భారీగా సుంకాలతో విరుచుకుపడుతోందన్న ట్రంప్
- తమ దేశ వస్తువులపై ఆయా దేశాలు అధిక టారిఫ్ విధిస్తున్నాయని విమర్శ
- అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని ఆరోపణ
తమ దేశ వస్తువులపై ఆయా దేశాలు అత్యధిక టారిఫ్ విధిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తమ వస్తువులపై సుంకాలు ఉండవని ఢిల్లీ అంగీకరించిందని ఆయన అన్నారు. తాను తీసుకున్న చర్యలతో ఆయా దేశాలు టారిఫ్‌లపై దిగి వస్తున్నాయని తెలిపారు.
ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని ఆయన ఆరోపించారు. తాను చర్యలు తీసుకోకపోతే వారు దిగి వచ్చేవారు కాదని అన్నారు. అందుకే సుంకాలు ఉండాలని, తద్వారా ఆర్థికంగా బలపడతామని ఆయన వ్యాఖ్యానించారు. వివిధ దేశాలపై విధిస్తున్న టారిఫ్‌లు అక్రమమని ఓ ఫెడరల్ అప్పీల్ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలపై కూడా ట్రంప్ స్పందించారు. ఈ కేసును ఇతర దేశాలు స్పాన్సర్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.