Chandrababu Naidu: రాష్ట్ర 5వ ఆర్ధిక సంఘం సభ్యులతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం

Chandrababu Pawan Kalyan Meet with State Fifth Finance Commission
  • నివేదిక అందించిన 5వ ఆర్థిక సంఘం
  • స్థానిక సంస్థల బలోపేతంపై ప్రభుత్వానికి కీలక సిఫార్సులు
  • ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై కీలక సిఫార్సులు చేసిన కమిషన్
రాష్ట్రంలోని స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల బలోపేతానికి ఉద్దేశించిన పలు కీలక సిఫార్సులతో కూడిన నివేదికను రాష్ట్ర 5వ ఆర్థిక సంఘం ప్రభుత్వానికి అందజేసింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‍తో ఆర్థిక సంఘం సభ్యులు సమావేశమై ఈ నివేదికను సమర్పించారు.

ఆర్థిక సంఘం ఛైర్‍పర్సన్ రత్నకుమారి, సభ్యులు ప్రసాదరావు, కృపారావు ఈ భేటీలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు, వాటికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తమ నివేదికలో పలు సూచనలు చేసినట్టు వారు ముఖ్యమంత్రికి వివరించారు. కేవలం ఆర్థికపరమైన అంశాలే కాకుండా, పాలనాపరమైన, ఇతర ఆర్థికేతర అంశాలపైనా లోతైన సిఫార్సులు చేసినట్లు తెలిపారు.

గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్థిక సంఘం ఈ సిఫార్సులను రూపొందించింది. ఈ సమావేశంలో ఆర్థిక, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. స్థానిక సంస్థల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో, ఆర్థిక సంఘం నివేదికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సిఫార్సులపై ప్రభుత్వం అధ్యయనం చేసి తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది.
Chandrababu Naidu
Andhra Pradesh
Pawan Kalyan
Fifth Finance Commission
Local bodies
Gram panchayats
Municipalities
Ratna Kumari
Financial autonomy

More Telugu News