Puri Jagannadh: చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న పూరీ జగన్నాథ్, ఛార్మి

Puri Jagannadh and Charmme Kaur Seek Blessings from Chinna Jeeyar Swamy
  • 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ'ని సందర్శించిన పూరీ జగన్నాథ్, ఛార్మి
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు
  • విజయ్ సేతుపతితో పాన్ ఇండియా సినిమా పనుల్లో పూరీ
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ'ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలను వారి బృందం సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తన తదుపరి సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో ఆయన ఒక భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ చిత్రంలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్ మధ్య సమయం తీసుకుని పూరీ, ఛార్మి కలిసి ముచ్చింతల్ వెళ్లి రావడం ఆసక్తికరంగా మారింది. 


Puri Jagannadh
Charmme Kaur
Chinna Jeeyar Swamy
Statue of Equality
Muchintal
Vijay Sethupathi
Pan India Movie
Telugu Cinema
Kollywood
Tollywood

More Telugu News