Samantha: సమంత దుబాయ్ వీడియో వైరల్... రాజ్ నిడిమోరు భార్య ఆసక్తికర పోస్ట్!

Samantha Dubai Video Viral Raj Nidimorus Wifes Interesting Post
  • దుబాయ్ ట్రిప్ వీడియోను పంచుకున్న నటి సమంత
  • వీడియోలో దర్శకుడు రాజ్ నిడిమోరు ఉన్నారని నెటిజన్ల ప్రచారం
  • కొన్ని గంటలకే రాజ్ భార్య శ్యామలీ దే ఆసక్తికర పోస్ట్
  • 'విరక్తి' అంటూ రాజ్ భార్య ఇన్‌స్టా స్టోరీ
  • గత కొంతకాలంగా సమంత, రాజ్ మధ్య డేటింగ్ రూమర్స్
స్టార్ హీరోయిన్ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య ప్రచారంలో ఉన్న ప్రేమ వ్యవహారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సమంత తన దుబాయ్ పర్యటనకు సంబంధించిన ఒక వీడియోను పంచుకున్న కొద్ది గంటలకే, రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ దే సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.

నిన్న‌ సమంత తన దుబాయ్ ట్రిప్‌కు సంబంధించిన ఒక రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో దర్శకుడు రాజ్ నిడిమోరు ముఖం స్పష్టంగా కనిపించనప్పటికీ, ఆమెతో పాటు ఆయన కూడా ఆ ట్రిప్‌లో ఉన్నారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే, రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ దే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'విరక్తి' (Detachment) గురించి ఒక పోస్ట్ పెట్టడం గమనార్హం.

"విరక్తి అంటే.. నీ దగ్గర ఏమీ ఉండకూడదని అర్థం కాదు. ఏదీ నిన్ను సొంతం చేసుకోకూడదు అనేదే అసలైన విరక్తి" అంటూ అలీ ఇబ్న్ అబీ తాలిబ్ కొటేషన్‌ను ఆమె షేర్ చేశారు. సమంత వీడియో బయటకు వచ్చిన వెంటనే ఆమె ఈ విధమైన పోస్ట్ పెట్టడంతో ఈ రెండు సంఘటనలను ముడిపెడుతూ నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.

గత కొంతకాలంగా సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి ప్రాజెక్టులకు వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఇటీవల ఒక విమాన ప్రయాణంలో రాజ్ భుజంపై సమంత తలవాల్చి ఉన్న ఫొటో, అలాగే పలు కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే, తమ మధ్య ఉన్న సంబంధంపై సమంత గానీ, రాజ్ నిడిమోరు గానీ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. తాజా పరిణామంతో వీరిద్దరి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Samantha
Samantha Ruth Prabhu
Raj Nidimoru
Shyamali De
Dubai trip
The Family Man 2
Citadel Honey Bunny
dating rumors
celebrity gossip
viral video

More Telugu News