KA Paul: కవితకు కేఏ పాల్ ఆఫర్

KA Paul Invites Kavitha to Fight for BCs in Praja Shanti Party
  • బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత
  • ప్రజాశాంతి పార్టీలోకి రావాలని కేఏ పాల్ ఆఫర్
  • బీజేపీ పంపిన బాణం కాదని రుజువు చేసుకో అని వ్యాఖ్య
బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీలోకి కవితను ఆహ్వానించారు. కవితను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

"కేసీఆర్ కూతురు కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. బీసీల కోసం పోరాడుతానని కవిత చెబుతోంది. కవిత... నిజంగా నీవు బీసీల కోసం పోరాడాలంటే... ఇప్పుడు బీసీల కోసం ఉన్న ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ. ప్రజాశాంతి పార్టీతో చేయి కలుపు, నువ్వు బీజేపీ పంపిన బాణం కాదని రుజువు చేసుకో. బీజేపీ బ్రాహ్మణుల పార్టీ. కాంగ్రెస్ రెడ్ల పార్టీ. దొరసానివైన నిన్ను ప్రజలు నమ్మాలంటే... గద్దరన్న చేరిన పార్టీ ప్రజాశాంతి పార్టీలో చేరు. ప్రజాశాంతి పార్టీలోకి రా. జూబ్లీహిల్స్ లో పోరాడుదాం... రుజువు చేసుకుందాం... అందరి మనసులు గెలుచుకుందాం" అంటూ కవితను కేఏ పాల్ ఆహ్వానించారు.
KA Paul
Kavitha
BRS Party
Praja Shanti Party
Telangana Politics
KCR
MLC
BC Community
Gaddar
Jubilee Hills

More Telugu News