Kavitha: వేరే పార్టీలో చేరడంపై కవిత ఏమన్నారంటే..!

Kavitha Resignation Letter to BR
  • కవితను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్
  • సస్పెన్షన్ ఆర్డర్ ను చదివి వినిపించిన కవిత
  • తాను ఏపార్టీలో చేరడం లేదని వెల్లడి
ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. రాజీనామా లేఖలను మీడియాకు చూపించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తనను  పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రకటన వచ్చిందని కవిత తెలిపారు. అంతేకాదు, తన సస్పెన్షన్ ఆర్డర్ ను చదివి వినిపించారు. నేను ప్రవర్తిస్తున్న తీరు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా నన్ను సస్పెండ్ చేశారట అని చెప్పారు. తన ఆత్మగౌరవం కోసం ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని ఆమె స్పష్టం చేశారు. తన అభిమానులు, జాగృతి కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. 


Kavitha
BRS
BRS Party
MLC
Telangana Politics
Kavitha Resignation
Jagruthi
Telangana News
Political News
Hyderabad

More Telugu News