Sarala Devi: పహల్గాం దాడి పేరుతో బెదిరించి 43 లక్షలు కాజేశారు

Elderly woman Sarala Devi loses 43 lakhs in Pahalgam terror link scam
  • నోయిడా వృద్ధురాలికి ఆన్ లైన్ లో బెదిరింపులు
  • ఆమె పేరుతో ఉగ్రవాదులు ముంబైలో బ్యాంకు ఖాతా తెరిచారని నాటకం
  • అరెస్ట్ వారెంట్ జారీ అయిందన్న చీటర్.. భయపడి డబ్బు పంపిన వృద్ధురాలు
పహల్గాంలో మారణహోమానికి పాల్పడ్డ ఉగ్రవాదులకు మీ ఫోన్ నెంబర్ నుంచే డబ్బులు చేరాయని బెదిరించి ఓ వృద్ధురాలి నుంచి సైబర్ నేరస్థులు 43 లక్షలు కాజేశారు. అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, రేపో మాపో పోలీసులు ఇంటికి వస్తారని చెప్పడంతో భయపడిన వృద్ధురాలు తన బ్యాంక్ ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం వారికి బదిలీ చేసింది.

వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని సెక్టార్ 41 లో నివాసం ఉండే సరళాదేవికి ఇటీవల ఓ దుండగుడు ఫోన్ చేశాడు. తాను పోలీస్ ఆఫీసర్ నని, ఉగ్రవాద కార్యాకలాపాలపై విచారణ జరుపుతున్నానని చెప్పుకున్నాడు. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి చెప్పి.. ఆ ఉగ్రవాదులకు మీ ఫోన్ నెంబర్ నుంచే నిధులు జమ అయ్యాయని బెదిరించాడు. ఉగ్రవాదులతో మీకు సంబంధాలు ఉన్నాయని ఎఫ్ఐఆర్ నమోదైందని, అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని చెప్పాడు.

దర్యాప్తులో భాగంగా సెక్యూరిటీ డిపాజిట్ గా కొంత సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో భయాందోళనకు గురైన సరళాదేవి.. దుండగుడు పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపించింది. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు 8 విడతలలో మొత్తం రూ.43.70 లక్షలు పంపించింది. మరోమారు రూ.15 లక్షలు చెల్లించాలని దుండగుడు కోరగా.. అనుమానంతో సరళాదేవి తెలిసిన లాయర్ ను సంప్రదించింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Sarala Devi
Pahalgam attack
cyber crime
online fraud
cyber fraud
Noida
police
extortion
terrorism funding
QR code scam

More Telugu News