TG Vishwa Prasad: ఆ మూడు సినిమాల వల్ల కోట్లు నష్టపోయాను: నిర్మాత విశ్వప్రసాద్

Vishwa Prasad Interview
  • భారీ చిత్రాల నిర్మాతగా విశ్వప్రసాద్ కి పేరు 
  • గత సినిమాల గురించి ప్రస్తావన 
  • ఒకే ఏడాదిలో మూడు సినిమాల నష్టం 
  • 'మిరాయ్'పై నమ్మకం ఉందని వెల్లడి  

టాలీవుడ్ లోని పెద్ద నిర్మాతల వరుసలో టి.జి. విశ్వప్రసాద్ కూడా కనిపిస్తారు. ఆయన బ్యానర్ నుంచి భారీ సినిమాలు వచ్చాయి .. కొన్ని సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అయితే క్రితం ఏడాది ఆయన నుంచి వచ్చిన సినిమాలు థియేటర్ల దగ్గర నిరాశపరిచాయి. ఆ సినిమాలు ఆయనకి నష్టాలను మిగిల్చాయి. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆ సినిమాలను గురించి ప్రస్తావించారు. 

" నేను సాఫ్ట్ వేర్ రంగం నుంచి ఈ వైపుకు వచ్చాను. అక్కడ సంపాదించిన డబ్బులనే సినిమాలలో పెట్టాను. నాకు మా తండ్రి .. తాతల నుంచి వారసత్వనగా వచ్చిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కేవలం నేను కష్టపడి సంపాదించిన డబ్బులతోనే సినిమాలు చేస్తూ వెళుతున్నాను. అయితే క్రితం ఏడాది మాత్రం నాకు చేదు అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి. పోయిన ఏడాది నేను చేసిన మూడు సినిమాలు పరాజయం పాలయ్యాయి" అని అన్నారు. 

" రవితేజ  హీరోగా నిర్మించిన 'ఈగల్' సినిమా వలన భారీగా నష్టపోయాను. అయితే 'మిస్టర్ బచ్చన్' సినిమా బాగా ఆడుతుందని అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఫలితం కూడా నిరాశ పరిచింది. ఇక శ్రీవిష్ణు హీరోగా నిర్మించిన 'స్వాగ్' కూడా భారీ నష్టాలను తెచ్చి పెట్టింది. ఒకే ఏడాదిలో మూడు సినిమాల నష్టాలను భరించడం అంత తేలికైన విషయమేం కాదు. ఈ నెల 12వ తేదీన మా బ్యానర్ నుంచి వస్తున్న 'మిరాయ్' భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది" అని అన్నారు. 

TG Vishwa Prasad
Eagle Movie
Mr Bachchan Movie
Swag Movie
Tollywood Producer
Telugu Cinema Losses
Ravi Teja
Sri Vishnu
Mirai Movie
Telugu Film Industry

More Telugu News