Kalyani Priyadarshan: 100 కోట్ల దిశగా 'లోకా' .. కల్యాణి ప్రియదర్శన్ దశ తిరిగినట్టే!

Lokah Chapter 1 Chandra Movie Update
  • మలయాళం నుంచి 'లోకా' 
  • ప్రధానమైన పాత్రలో కల్యాణి ప్రియదర్శన్
  • 4 రోజుల్లో 66 కోట్లకిపైగా వసూళ్లు
  • కాన్సెప్ట్ కి దక్కుతున్న ప్రశంసలు  

 కల్యాణి ప్రియదర్శన్ .. 2017లోనే వెండితెరపైకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి తనకి నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. తండ్రి ప్రియదర్శన్ గొప్ప దర్శకుడు అయినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కోరుకుంటూ అడుగులు వేస్తోంది. అందువల్లనే ఆమె కెరియర్ కాస్త స్లోగా ఉందేమో అని కూడా అనిపించకమానదు. అలాంటి కల్యాణికి ఇప్పుడు ఒక ఒక భారీ హిట్ తగిలిందనే అనుకోవాలి. ఆ సినిమా పేరే 'లోకా: చాప్టర్ 1- చంద్ర'. 
 
డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. కల్యాణి ప్రియదర్శన్ తో పాటు నెస్లెన్ .. శాండీ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, రిలీజ్ రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉందని చెప్పుకుంటున్నారు. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం. 

ఈ సినిమాను 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 66 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా స్పీడ్ చూస్తుంటే, 100 కోట్ల మార్క్ ను టచ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదని అంటున్నారు. కల్యాణి ప్రియదర్శన్ ఇంతవరకూ 15 సినిమాలు చేసినప్పటికీ, అసలైన  హిట్ ఈ సినిమాతోనే పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మలయాళ ఇండస్ట్రీ ఈ ఏడాది మరో హిట్ ను తానా ఖాతాలో వేసుకుందన్న మాట. 

Kalyani Priyadarshan
Loka Chapter 1 Chandra
Malayalam movie
Dominic Arun
Neslen
Sandy
Jakes Bejoy
Malayalam film industry
box office collection

More Telugu News