Kavitha: బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్... కేసీఆర్ సంచలన నిర్ణయం

Kavitha Suspended from BRS Party KCR Decides
  • కవితను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన బీఆర్ఎస్
  • కవిత తీరు పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉందని పేర్కొన్న బీఆర్ఎస్
  • తక్షణమే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లపై కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులు సోమా భరత్ కుమార్, టి. రవీందర్ రావు పేర్ల మీద ప్రకటన వెలువడింది.

"పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున పార్టీ అధిష్ఠానం ఈ విషయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు" అని బీఆర్ఎస్ తన ప్రకటనలో పేర్కొంది.
Kavitha
Kalvakuntla Kavitha
BRS
BRS Party
KCR
K Chandrashekar Rao
Harish Rao
Santosh Kumar

More Telugu News