Pawan Kalyan: అన్నయ్య చిరంజీవికి థాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్
- ఈరోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు
- సోదరుడికి శుభాకాంక్షలు తెలుపుతూ చిరు ఆసక్తికర ట్వీట్
- చిరంజీవి పెట్టిన పోస్టుకు జనసేనాని తనదైనశైలిలో రిప్లై
ఈరోజు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఈ క్రమంలో పవన్ సోదరుడు చిరంజీవి తన సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిరు ఓ పాత ఫొటోను పంచుకున్నారు. కల్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరంజీవి పెట్టిన ఈ పోస్టుకు జనసేనాని తనదైనశైలిలో రిప్లై ఇచ్చారు.
"నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మవిభూషణ్ చిరంజీవికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలు, ఆశీస్సులు, శుభాకాంక్షలు ఎంతో ఆనందాన్నిచ్చాయి. సమాజానికి ఏదైనా చేయాలని మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. మీరు ఎప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, నాతోపాటు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని కోరుకుంటున్నా" అంటూ మెగాస్టార్‌కు పవన్ థాంక్స్ చెప్పారు. అలాగే తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.