Raghava Lawrence: 'కాంచన 4': దడపుట్టించే పాత్రలో రష్మిక?

Kanchana 4 Movie Update
  • షూటింగు దశలో 'కాంచన 4'
  • ప్రధాన పాత్రల్లో పూజ - నోరా ఫతేహి 
  • కీలకమైన పాత్రలో రష్మిక
  • 65 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం 
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు       
   
కోలీవుడ్ నుంచి దెయ్యం నేపథ్యంలో సినిమాలు చాలానే వచ్చాయి. అయితే 'కాంచన' పరిస్థితి వేరు. తమిళంలో 'ముని' సినిమాతో దర్శకుడిగా లారెన్స్ ప్రయాగం చేసినప్పుడు ముందుగా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత థియేటర్లలో సందడి చేయడం మొదలు పెట్టింది. 'ముని' సినిమాకి సీక్వెల్ గా ఆయన తెరకెక్కించిన 'కాంచన' .. 'కాంచన 2' .. 'కాంచన 3' భారీ విజయాలను నమోదు చేశాయి. అయితే 'కాంచన 2' ఎక్కువగా ప్రేక్షకులను భయపెట్టగలిగింది. 

'కాంచన 4' కోసం ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా పనులతోనే లారెన్స్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం పూజ హెగ్డేను .. నోరా ఫతేహిని తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. రీసెంటుగా రష్మిక పేరు తెరపైకి వచ్చింది. పూజ హెగ్డే స్థానంలో ఆమెను తీసుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. కానీ రష్మికను ఒక కీలకమైన పాత్ర కోసం ఎంచుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో దెయ్యంగా కనిపించేది ఆమెనేనని అంటున్నారు.

రష్మికకి తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె అయితే బాగుంటుందని భావించి లారెన్స్ సంప్రదించడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయిందని అంటున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావలసి ఉంది. గోల్డ్ మైన్ బ్యానర్ పై 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Raghava Lawrence
Kanchana 4
Rashmika Mandanna
Pooja Hegde
Nora Fatehi
Kollywood horror movies
Tamil cinema
horror comedy
Goldmine banner
Kanchana movie series

More Telugu News