Yogesh Alekar: బైక్ పై ప్రపంచయాత్ర.. యూకేలో బైక్ చోరీ

Mumbai biker Yogesh Alekar faces theft in Nottingham during world tour
  • సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ముంబై యువకుడి విన్నపం
  • వీసా, పాస్ పోర్ట్ కూడా బైక్ లోనే ఉన్నాయనీ, కట్టుబట్టలతో మిగిలానంటూ ఆవేదన
  • 118 రోజుల్లో 17 దేశాల గుండా 24 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు వెల్లడి
  • నలుగురు యువకులు బైక్ ఎత్తుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తింపు
బైక్ పై ప్రపంచ యాత్రకు బయలుదేరిన ముంబై యువకుడు యోగేశ్ అలెకరికి యూకేలో చేదు అనుభవం ఎదురైంది. నాటింగ్ హామ్ లోని ఓ పార్క్ లో పెట్టిన బైక్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానికంగా ఉంటున్న ఓ స్నేహితుడిని కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసి తిరిగొచ్చే సరికి బైక్ మాయమైందని యోగేశ్ వాపోయాడు. నలుగురు యువకులు తన బైక్ ను ఎత్తుకెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైందని చెప్పాడు. పాస్ పోర్ట్, వీసా వంటి కీలక డాక్యుమెంట్లతో పాటు డబ్బు కూడా అందులోనే ఉండిపోయిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను కట్టుబట్టలతో మిగిలానని వాపోయాడు.

2025 మే 1న ముంబై నుంచి బైక్ పై ప్రపంచయాత్రకు బయలుదేరానని యోగేశ్ చెప్పారు. ఇప్పటి వరకు.. 118 రోజుల్లో 17 దేశాలను చుట్టేశానని, మొత్తంగా 24 వేల కిలోమీటర్లు తిరిగానని యోగేశ్ వివరించాడు. బైక్ చోరీ కావడంతో ప్రస్తుతం యాత్ర కొనసాగించాలన్నా.. ఇంటికి చేరుకోవాలన్నా వీలు లేకుండా పోయిందని నిరాశ వ్యక్తం చేశాడు. దొంగలు బైక్ ఎత్తుకెళుతున్న సీసీటీవీ ఫుటేజీని షేర్ చేస్తూ.. తన ఈ పోస్టును షేర్ చేయాలని, అధికారులు వేగంగా స్పందించేందుకు సాయం చేయాలని ఫాలోవర్లకు విజ్ఞప్తి చేశాడు.
Yogesh Alekar
Mumbai biker
World tour
Bike theft UK
Nottingham
Passport stolen
Visa stolen
Indian biker
Motorcycle travel

More Telugu News