Anushka Shetty: అనుష్క గ్యాప్ 'ఘాటి'కి కలిసొచ్చేనా?

Anushka Special
  • క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'ఘాటి'
  • విభిన్నమైన పాత్రలో అనుష్క 
  • రెండేళ్ల తరువాత ఆమె నుంచి వస్తున్న సినిమా 
  • అభిమానులలో పెరుగుతున్న అంచనాలు
  • ఈ నెల 5వ తేదీన భారీ విడుదల

అందానికి అర్థం చెప్పే దీపం .. ఆకర్షణకి అద్దం పట్టే రూపం అనుష్క. అలాంటి అనుష్కకి తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ రెండు భాషల్లోని సీనియర్ స్టార్ హీరోలందరి సరసన ఆమె నటించింది. అనుష్క ఎంచుకున్న పాత్రలు .. నటన .. వ్యక్తిత్వం .. ఇవన్నీ ఆమెను చాలా వేగంగా నెక్స్ట్ లెవెల్ కి చేర్చాయి. 'అరుంధతి' తరువాత అనుష్క క్రేజ్ అంచనాలకు అందకుండా వెళ్లింది. నాయిక ప్రధానమైన కథలకు బలమైన అండ దొరికిందని మేకర్స్ భావించారు. 

అనుష్క ప్రధానమైన పాత్రను పోషించిన సినిమాల మార్కెట్ కూడా స్టార్ హీరోలతో సమానంగా పెరిగిపోయింది. అత్యధిక పారితోషికాన్ని అందుకునే కథానాయికల జాబితాలో ఆమె చేరిపోయింది. అయితే నాయిక ప్రధానమైన కథలలో 'రుద్రమదేవి' మినహా, ఆమెకు అంతగా పేరు తెచ్చిన పాత్రలేవీ కనిపించలేదు. ఆ సినిమాలు వసూళ్ల పరంగా కూడా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలోనే 2018 నుంచి అనుష్క తన సినిమాల సంఖ్యను చాలా వరకూ తగ్గించుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. 

అయితే అనుష్క గత సినిమాలు నిరాశ పరిచినా .. వరుస సినిమాలు చేయకపోయినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. అనుష్క సినిమా ఎప్పుడు వస్తుందా అనే అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల గ్యాప్ తరువాత అనుష్క ఇప్పుడు 'ఘాటి' సినిమాతో పలకరించబోతోంది. ఈ నెల 5వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. 

ఈ సినిమాలో అనుష్క గంజాయి కోసే కూలీగా కనిపించనుంది. ఆమె లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఆమెపై యాక్షన్ సీన్స్ కూడా భారీగానే ఉన్నాయనే విషయం, ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె జోడీగా కనిపించే 'విక్రమ్ ప్రభు'కి ఇదే మొదటి తెలుగు సినిమా. విద్యాసాగర్ సంగీతంపై కూడా నమ్మకంతో ఉన్నారు. అనుష్క తీసుకున్న గ్యాప్ .. ఆమెకు గల క్రేజ్ ఈ సినిమాకి ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. వాళ్ల అంచనా నిజమవుతుందేమో చూడాలి మరి.

Anushka Shetty
Anushka Shetty movie
Ghaati movie
Vikram Prabhu
Telugu cinema
Krish Jagarlamudi
Vidya Sagar
South Indian movies
actress Anushka
Rudramadevi movie

More Telugu News