YS Jagan: ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ జగన్

YS Jagan Pays Tribute at YSR Ghat in Idupulapaya
  • నేడు మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి
  • ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్ కు నివాళులర్పిస్తున్న నేతలు, అభిమానులు
  • ఇడుపులపాయలో కుటుంబ సభ్యులు, నేతలతో కలిసి నివాళులర్పించిన వైఎస్ జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, అభిమానులు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద పాల్గొని నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్‌ దంపతులు, కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ అర్ధాంగి విజయమ్మ,  వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.  
 
ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్ బాషా, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యే ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర నాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు తదితరులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.

.
YS Jagan
YS Rajasekhara Reddy
YSR Ghat
Idupulapaya
YSR death anniversary
YS Vijayamma
YS Bharati
YSR Congress Party
Andhra Pradesh politics
Kadapa

More Telugu News