BSNL: ఫ్రీడమ్ ప్లాన్‌ను పొడిగించిన బీఎస్ఎన్ఎల్

BSNL Extends Freedom Plan Offering Unlimited Services
  • ఆజాదీ కా ప్లాన్‌ను సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన బీఎస్ఎన్ఎల్
  • రూ.1కే అపరిమిత సేవలు అందించే ఈ ప్లాన్‌కు వినియోగదారుల నుంచి విశేష స్పందన
  • మేక్ ఇన్ ఇండియా కింద దేశవ్యాప్తంగా ఆధునిక 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించామన్న సీఎండీ రాబర్ట్ జె రవి
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తీసుకువచ్చిన రూ.1కే అపరిమిత సేవలు అందించే "ఆజాదీ కా ప్లాన్"కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో ఈ ప్లాన్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టులో ఈ ప్రత్యేక ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

వినియోగదారుల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో ఈ ప్రత్యేక ఆఫర్‌ను తాజాగా సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్లాన్.. తాజా నిర్ణయంతో ఈ నెల 15 వరకు అందుబాటులో ఉండనుంది.

ఒక రూపాయికే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎమ్మెస్‌లు లభించే ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, 4జీ సిమ్ ఉచితంగా అందుతోంది.

బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ ఎ. రాబర్ట్ జె. రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “మేక్ ఇన్ ఇండియా కింద దేశవ్యాప్తంగా ఆధునిక 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించాం. ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులు కొత్త 4జీ సేవలను తక్కువ ఖర్చుతో ఉపయోగించేందుకు అవకాశం లభిస్తోంది,” అన్నారు.

ఈ ప్లాన్‌ను పొందాలంటే వినియోగదారులు సమీప బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) లేదా ఆధికారిక రిటైలర్‌ను సంప్రదించాలి. మరిన్ని వివరాల కోసం 1800-180-1503కు కాల్ చేయవచ్చు లేదా www.bsnl.co.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 
BSNL
BSNL Azadi ka Plan
BSNL 4G
Robert J Ravi
BSNL Free Data
BSNL Offer
Telecom Offer India
BSNL Customer Service

More Telugu News