Mallikarjun Kharge: మోదీకి 'దొంగతనాలు' అలవాటే: ఖర్గే

Mallikarjun Kharge accuses Modi of theft
  • ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఫైర్
  • 'ఓట్ల చోరీ' ద్వారా బీహార్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్న ఆరోపణ
  • మోదీకి దొంగతనం చేయడం అలవాటంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
  • త్వరలోనే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం
  • పట్నాలో 'వోటర్ అధికార్ యాత్ర' ముగింపు సభలో ప్రసంగం
 కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఓట్ల చోరీ'కి పాల్పడి గెలవాలని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీహార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే మోదీ, అమిత్ షా ఇద్దరూ కలిసి ప్రజలను అణచివేస్తారని హెచ్చరించారు.

పాట్నాలో విపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఓటర్ అధికార్ యాత్ర' ముగింపు సభలో ఖర్గే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మోదీకి 'చోరీ' చేయడం ఒక అలవాటుగా మారింది. ఓట్లు దొంగిలించడం, డబ్బు దొంగిలించడం, బ్యాంకులను దోచుకున్న వారికి అండగా నిలవడం వంటివి ఆయనకు అలవాటే" అని ఆరోపించారు. బీహార్ ఎన్నికలను ఎలాగైనా గెలవడానికి మోదీ ఓట్లను దొంగిలించే ప్రయత్నం చేస్తారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

త్వరలోనే ఎన్‌డీఏ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వం పేదలు, మహిళలు, దళితులు, వెనుకబడిన వర్గాలదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ యాత్రను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా, బీహార్ ప్రజలు వెనక్కి తగ్గలేదని ఖర్గే పేర్కొన్నారు.
Mallikarjun Kharge
Narendra Modi
Bihar elections
Congress
BJP
Vote rigging
Patna
Opposition rally
Amit Shah
NDA government

More Telugu News