Harish Rao: అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులే జరుపుతారట!: హరీశ్ రావు

Harish Rao Slams Congress for Mud Politics on Floods
  • అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోతున్నారని విమర్శ
  • వరదలపై చర్చకు వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం చేస్తోందని ఆగ్రహం
  • సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో కోరామన్న హరీశ్ రావు
వరదలపై చర్చకు వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోతున్నారని ఆయన విమర్శించారు. బీఏసీ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు రోజులే అసెంబ్లీ నడిపిస్తామని ప్రభుత్వం చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో కోరామని హరీశ్ రావు తెలిపారు. వరద నష్టాలు, ఎరువుల కొరత, గురుకులాల్లో వందకు పైగా మరణాలు, విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్ గురించి అసెంబ్లీలో చర్చించాలని కోరామని ఆయన అన్నారు.
Harish Rao
Telangana floods
Congress party
BRS party
Telangana Assembly
Fertilizer shortage

More Telugu News