మామయ్య చిరంజీవి ఎదుట కంటతడి పెట్టుకున్న అల్లు అర్జున్
- అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ కన్నుమూత
- ముంబై నుంచి హైదరాబాద్ కు చేరుకున్న అల్లు అర్జున్
- నానమ్మ భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురైన బన్నీ
నానమ్మ మరణవార్త తెలిసిన వెంటనే, ముంబైలో తన సినిమా షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఇంటికి చేరుకుని నానమ్మ భౌతికకాయాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ విషాద సమయంలో అల్లు కుటుంబాన్ని పరామర్శించేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన అర్ధాంగి సురేఖ వారి నివాసానికి వెళ్లారు. తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న తన బావమరిది అల్లు అరవింద్‌ను, తీవ్ర వేదనలో ఉన్న అల్లు అర్జున్‌ను చిరంజీవి ఓదార్చారు. ఈ సందర్భంగా చిరంజీవిని చూడగానే అల్లు అర్జున్ మరోసారి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకోవడం అక్కడున్న వారిని కలచివేసింది. అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.