Shyamala: ఇదే విద్యాశాఖ మంత్రి ప్రొఫైల్: యాంకర్ శ్యామల

Shyamala Criticizes AP Education Minister Nara Lokesh
  • విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ నేత శ్యామల పరోక్ష విమర్శలు
  • టెన్త్, డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయ్యారంటూ ఆరోపణ
  • గత ప్రభుత్వంలో జగన్ 2.50 లక్షల ఉద్యోగాలిచ్చారన్న శ్యామల
  • సచివాలయ, వైద్య శాఖల్లో భారీగా నియామకాలు జరిగాయని వెల్లడి
  • సమర్థుడు ఎవరో, అసమర్థుడు ఎవరో చెప్పాలంటూ సూటి ప్రశ్న
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. పరీక్షలు నిర్వహించడంలో విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అంటూ శ్యామల సోషల్ మీడియాలో స్పందించారు. 

"పదవ తరగతి పరీక్షలు నిర్వహించడంలో ఫెయిల్! డీఎస్సీ పరీక్షలు నిర్వహించడంలో ఫెయిల్!... ఇదే విద్యాశాఖ మంత్రి ప్రొఫైల్! ఇక పాయింట్ కి వస్తే ... గతంలో జగన్ ప్రభుత్వం సుమారు 1.30 లక్షల సచివాలయ ఉద్యోగాలు, వైద్య శాఖలో మరో 50 వేల ఉద్యోగాలు, ఇలా మిగతా విభాగాల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు మొత్తం కలిపితే సుమారు 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను ఎటువంటి అవకతవకలు లేకుండా చేపట్టింది! ఇప్పుడు చెప్పండి సమర్ధుడు ఎవరు? అసమర్థుడు ఎవరు?" అంటూ శ్యామల ప్రశ్నించారు.
Shyamala
Nara Lokesh
AP Education Minister
YCP
AP DSC
10th Class Exams
Andhra Pradesh Jobs
Jagan Government
Secretariat Jobs
Education Department

More Telugu News