Sara Tendulkar: సారా టెండూల్కర్ బ్యూటీ సీక్రెట్.. ఖరీదైన ఉత్పత్తులు కాదు.. అసలు రహస్యం ఇదే!

 Sara Tendulkar Reveals Her Skincare Routine
  • తన స్కిన్‌కేర్ రహస్యాలను పంచుకున్న స‌చిన్ త‌న‌య 
  • ఎంత సింపుల్‌గా ఉంటే అంత మంచిదని వెల్లడి
  • ఫేస్‌వాష్, సీరమ్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ మాత్రమే తన రొటీన్ అన్న సారా
  • ఖరీదైన ఉత్పత్తుల కన్నా జీవనశైలి మార్పులే ప్రభావం చూపుతాయని స్పష్టీక‌ర‌ణ‌
  • పాలు, చక్కెర తగ్గించడం, నీళ్లు తాగడమే తన బ్యూటీ సీక్రెట్ అని వెల్లడి
సెలబ్రిటీల చర్మ సౌందర్యం అనగానే ఎన్నో ఖరీదైన ఉత్పత్తులు, క్లిష్టమైన పద్ధతులు గుర్తుకొస్తాయి. కానీ, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మాత్రం తన అందం వెనుక ఉన్నది ఖరీదైన క్రీములు కాదని, చాలా సింపుల్ అలవాట్లేనని స్పష్టం చేశారు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన స్కిన్‌కేర్ రహస్యాలను పంచుకున్నారు. బయోమెడికల్ సైన్స్‌ విద్యనభ్యసించిన 27 ఏళ్ల సారా, చర్మ సంరక్షణలో శాస్త్రీయమైన, సహజమైన పద్ధతులకే ప్రాధాన్యమిస్తానని తెలిపారు.

చర్మ సంరక్షణ ఎంత సరళంగా, క్రమబద్ధంగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయని సారా నమ్ముతారు. "నా స్కిన్‌కేర్ రొటీన్ చాలా సాధారణం. రోజూ ఫేస్‌వాష్, సీరమ్ లేదా టోనర్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ మాత్రమే వాడతాను. అనవసరమైన ప్రయోగాలు ఎక్కువగా చేయను" అని ఆమె వివరించారు. అప్పుడప్పుడు అవసరమైతే యాసిడ్ పీల్స్ వంటివి వాడినా, వాటిని కూడా చాలా పరిమితంగానే ఉపయోగిస్తానని ఆమె పేర్కొన్నారు.

అయితే, చర్మంపై క్రీముల కన్నా మన జీవనశైలి, రోజువారీ అలవాట్లే ఎక్కువ ప్రభావం చూపుతాయని సారా తెలిపారు. "నిజం చెప్పాలంటే, నా చర్మం స్కిన్‌కేర్ ఉత్పత్తుల కన్నా నేను తీసుకునే ఆహారం, జీవనశైలి మార్పులకే ఎక్కువగా స్పందిస్తుంది. పాలు, చక్కెర వాడకాన్ని తగ్గించడం, రోజూ తగినన్ని నీళ్లు తాగడం, సరిపడా నిద్రపోవడం వంటివే నా చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి" అని ఆమె అన్నారు.

మంచి జీవనశైలి అలవాట్లతో పాటు సరైన స్కిన్‌కేర్‌ను బ్యాలెన్స్ చేసుకోవడమే తన సౌందర్య రహస్యమని సారా చెప్పుకొచ్చారు. ఖరీదైన ఉత్పత్తుల వెంట పడకుండా, జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఎవరైనా ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని ఆమె సూచించారు.
Sara Tendulkar
Sara Tendulkar beauty secrets
Sara Tendulkar skincare
Sachin Tendulkar daughter
skincare routine
healthy lifestyle
diet and skin
natural skincare
Indian celebrity skincare

More Telugu News