Donald Trump: ట్రంప్ కు ఏమైంది? అనారోగ్యంతో బాధపడుతున్నాడంటూ ప్రచారం

Donald Trump Health Concerns Spark Speculation
  • బాహ్య ప్రపంచానికి కనిపించని అమెరికా అధ్యక్షుడు
  • ట్రూత్ సోషల్ లో పోస్టులు పెట్టడంతో సరిపెడుతున్న ట్రంప్
  • వారాంతంలోనూ అధ్యక్షుడి షెడ్యూల్స్ లేకపోవడంపై అనుమానాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంతో బాధపడుతున్నారని అగ్రరాజ్యంలో ప్రచారం జరుగుతోంది. నిత్యం మీడియాతో టచ్ లో ఉండే ట్రంప్ ఇటీవల బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. ప్రస్తుతం ట్రంప్ ఏం చెప్పాలనుకున్నా తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ లో పోస్టు చేస్తున్నారు. ఆగస్టు 30, 31 తేదీల్లో ట్రంప్ పబ్లిక్‌ ఈవెంట్లలో పాల్గొనడం లేదని వైట్ హౌస్ వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ట్రంప్ చేతిపై గాయాలు కనిపించడంతో సోషల్‌ మీడియాలో పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మరోవైపు, ఇవన్నీ ఊహాగానాలేనని మరికొందరు చెబుతున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. సెప్టెంబర్‌ 1న కార్మిక దినోత్సవం నేపథ్యంలో వారాంతంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇక, ట్రంప్ చేతి గాయం నిజమేనని ఆయన వైద్యుడు షాన్‌ బార్బబెల్లా వెల్లడించారు. అయితే, అదంత తీవ్రమైనది కాదని, ట్రంప్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.
Donald Trump
Trump health
Donald Trump illness
Trump social media
Truth Social
Sean Barbbella
JD Vance
US President

More Telugu News