Narendra Modi: మోదీ చైనా పర్యటనపై ఇటు రాజ్ నాథ్​, అటు చైనా ఎంబసీ స్పందన

Narendra Modi China Visit Rajnath Singh Comments
  • శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న రక్షణ మంత్రి
  • దేశానికి ఉపయోగపడే శాశ్వత ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్య
  • గణేశుడి ప్రతిమల చిత్రాలను పోస్ట్ చేసిన చైనా ఎంబసీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై ఇరు దేశాల్లో ఆసక్తి నెలకొనగా.. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాల మధ్య శాశ్వత శత్రుత్వం ఉండదని చెప్పారు. దేశ ప్రయోజనాలే శాశ్వతమని స్పష్టం చేశారు. ‘శాశ్వత మిత్రులు కానీ, శత్రువులు కానీ ఉండరు. దేశాల మధ్య శాశ్వత శత్రుత్వం ఉండదు. కేవలం ఆ దేశానికి ఉపయోగపడే శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓ జాతీయ మీడియా సదస్సులో పాల్గొన్న రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనా ఎంబసీ ఆసక్తికర పోస్ట్..
తమ దేశంలో మోదీ పర్యటన నేపథ్యంలో చైనా ఎంబసీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. భారత్, చైనాల మధ్య సాంస్కృతిక సంబంధాలను చాటిచెప్పే చిత్రాన్ని పోస్ట్ చేసింది. ‘టాంగ్ రాజవంశం కాలంలో, మొగావో గుహలలో కనిపించిన గణేశుడి ప్రతిమలు ఇవి. శతాబ్దాల కాలం నుంచే ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయనే దానికి ఇదొక అందమైన ప్రతీక’ అని ఆ ఫొటోకు క్యాప్షన్ జత చేసింది.
Narendra Modi
China visit
Raj Nath Singh
India China relations
Chinese Embassy
Mogao Caves
Ganesha idols
India China cultural relations

More Telugu News