Rajinikanth: 14 రోజులుగా 'కూలీ' రాబట్టింది ఎంతంటే..?

Coolie Movie Update
  • 12 వేల థియేటర్లలో విడుదలైన 'కూలీ'
  • ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకి పైగా వసూళ్లు
  • ఎక్కువ మార్కులు కొట్టేసిన సౌబిన్ షాహిర్
  • వరదల కారణంగా తగ్గుముఖం పట్టిన వసూళ్లు

రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందిన 'కూలీ' ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ప్రపంచ వ్యాప్తంగా 12వేల థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. నాగార్జున .. శృతి హాసన్ .. సత్యరాజ్ .. సౌబిన్ షాహిర్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, ఆమీర్ ఖాన్ .. ఉపేంద్ర ప్రత్యేక పాత్రలలో మెరిశారు. 

ఈ 14 రోజులలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 74 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని అంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 505 కోట్ల గ్రాస్ .. 255 కోట్ల షేర్ ను వసూలు చేసిందని చెబుతున్నారు. తమిళంలో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ 4 సినిమాల జాబితాలోకి 'కూలీ' చేరిపోయిందనే టాక్ వినిపిస్తోంది. టాప్ త్రీ లోకి ఎంటర్ కావడానికి ఎంతో సమయం పట్టదని రజనీ ఫ్యాన్స్ అంటున్నారు. ఆశించిన స్థాయిలో వసూళ్లు పెరగకపోవడానికి కారణం, దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు .. వరదలు రావడమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

'కూలీ'గా రజనీ మెప్పించారు. ఇక విలన్ నాగ్ చేసిన రోల్ కొత్తగా అనిపిస్తుంది. చాలా కాలం తరువాత శృతి హాసన్ మళ్లీ కాస్త గ్లామరస్ గా కనిపించింది. ఉపేంద్ర .. సత్యరాజ్ .. ఆమీర్ ఖాన్ వంటి ఆర్టిస్టులు తెరపై కనిపించినప్పటికీ, రజనీ తరువాత ఎక్కువ మార్కులు కొట్టేసింది సౌబిన్ షాహిర్ అనే చెప్పాలి. సౌబిన్ పాత్ర నాగ్ పాత్రను కూడా డామినేట్ చేసిందనే అనాలి. అనిరుధ్ స్వరపరిచిన 'మోనికా' సాంగ్, ఆడియన్స్ కి ఒక రేంజ్ లో ఎనర్జీని అందించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 



Rajinikanth
Kooli movie
Kooli collections
Lokesh Kanagaraj
Nagarjuna
Shruti Haasan
Sun Pictures
Telugu states box office

More Telugu News