Andhra Pradesh Government: రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం దృష్టి

Andhra Pradesh Government Starts Review of Rushikonda Buildings Utilization
  • భవనాలను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై కసరత్తు
  • అధ్యయనం చేసేందుకు ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు
  • సరైన విధంగా వినియోగించే మార్గాలపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని సూచన
రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. భవనాల వినియోగంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భవనాలను సముచితంగా వినియోగించే మార్గాలను అన్వేషించి, తగిన సిఫార్సులు ప్రభుత్వానికి అందజేయాలని కమిటీకి సూచించారు.
Andhra Pradesh Government
Rushikonda buildings
Andhra Pradesh tourism
Kandula Durgesh

More Telugu News