F-16 Fighting Falcon: ఎయిర్‌షో రిహార్సల్స్‌లో ఘోరం.. కుప్పకూలిన ఎఫ్-16 విమానం.. వీడియో ఇదిగో!

F16 Fighting Falcon crashes during airshow rehearsal in Poland
షార్ట్స్‌లో చూడండి
పోలాండ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ పోలాండ్‌లోని రాడోమ్‌ నగరంలో ఎయిర్‌షో కోసం నిర్వహిస్తున్న రిహార్సల్స్‌లో భాగంగా పోలిష్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం నిన్న కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానాన్ని నడుపుతున్న పైలట్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని దేశ ఉప ప్రధాన మంత్రి వ్లాడిస్లావ్ కొసినియాక్-కామిస్జ్ అధికారికంగా ధ్రువీకరించారు.

ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాల్లో బ్యారెల్-రోల్ విన్యాసం చేసేందుకు ప్రయత్నించిన ఫైటర్ జెట్ అదుపుతప్పి వేగంగా నేలవైపు దూసుకొచ్చింది. రన్‌వేపై కుప్పకూలిన వెంటనే భారీ అగ్నిగోళంగా మారి మంటల్లో చిక్కుకుంది. మంటలతోనే విమానం కొన్ని మీటర్ల దూరం దూసుకెళ్లిన దృశ్యాలు అందులో రికార్డయ్యాయి.

ఈ ఘటనపై ఉప ప్రధాని వ్లాడిస్లావ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. పైలట్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఎఫ్-16 విమాన ప్రమాదంలో పోలిష్ ఆర్మీ పైలట్ మరణించారు. ఆయన గొప్ప ధైర్యసాహసాలు, అంకితభావంతో మాతృభూమికి సేవ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. 
Go Back to Shorts
F-16 Fighting Falcon
Poland plane crash
Radom Air Show
Polish Air Force
F-16 crash video
Vladyslav Kosiniak-Kamysz
Airshow accident
Fighter jet crash
Aviation accident
Military aviation

More Telugu News