Sugali Preethi Case: ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.. పవన్‌ను కోరిన సుగాలి ప్రీతి తల్లి

Sugali Preethis Mother Appeals to Pawan Kalyan for Justice
  • సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని తల్లి పార్వతి డిమాండ్
  • కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి
  • గతంలో పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని గుర్తు చేసిన తల్లి
  • స్పందించకపోతే జనసేన ఆఫీసు ముందు ఆమరణ దీక్ష చేస్తానన్న పార్వ‌తి
తమ కుమార్తె సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలంటూ ఆమె తల్లి సుగాలి పార్వతి కొత్త ప్రభుత్వానికి కన్నీటితో విజ్ఞప్తి చేశారు. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో ఆయన పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ఆమె అన్నారు.

గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుగాలి పార్వతి మాట్లాడారు. తన కుమార్తె కేసును వెంటనే సీబీఐకి అప్పగించి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె కూటమి ప్రభుత్వాన్ని కోరారు. "దివ్యాంగురాలినైన నేను, గత ఎనిమిదేళ్లుగా నా బిడ్డకు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను. అయినా ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు" అని చెబుతూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. "అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసులో నిందితులకు శిక్ష పడేలా చూస్తానని గతంలో పవన్ మాటిచ్చారు. ఇప్పుడు ఆయన అధికారంలో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పటికైనా ఆయన స్పందించి, ఇచ్చిన మాట ప్రకారం మాకు న్యాయం చేయాలి" అని పార్వతి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే తన పోరాటాన్ని ఉధృతం చేస్తానని, జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని ఆమె స్పష్టం చేశారు. 
Sugali Preethi Case
Pawan Kalyan
Sugali Preethi
Sugali Parvathi
Andhra Pradesh
Janasena
CBI investigation
Justice for Sugali Preethi
Political News
Hunger Strike
AP Politics

More Telugu News