Nandamuri Balakrishna: బాలకృష్ణ 'అఖండ 2' వాయిదా.. కారణం ఇదే!

Nandamuri Balakrishna Akhanda 2 Release Postponed
  • అధికారికంగా వాయిదా పడిన ‘అఖండ 2’ చిత్రం
  • నాణ్యత విషయంలో రాజీ పడలేమన్న చిత్ర బృందం
  • రీ-రికార్డింగ్, విజువల్స్ పనుల్లో జాప్యమే కారణం
  • త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని వెల్లడి
  • ఇది సినిమా కాదు, పండుగ అంటున్న నిర్మాతలు
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘అఖండ 2’ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర బృందం ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ, సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమా నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా, సినిమాకు ప్రాణంగా నిలిచే రీ-రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌కు మరింత సమయం అవసరమని వారు పేర్కొన్నారు. అత్యుత్తమ థియేటర్ అనుభూతిని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతోనే ఈ ఆలస్యం జరుగుతోందని వివరించారు.

వాస్తవానికి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ముందుగా నిర్ణయించారు. అయితే, పనుల్లో జాప్యం కారణంగా ఆ తేదీకి సినిమాను విడుదల చేయలేకపోతున్నామని చిత్ర బృందం తెలిపింది. వీలైనంత త్వరగా కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో అన్ని భాషల్లో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయని, ఆ అంచనాలను అందుకునేలా సినిమాను తీర్చిదిద్దుతున్నామని వారు తెలిపారు.

‘అఖండ 2 తాండవం ఒక సినిమా కాదు, అదొక సినిమా పండుగ’ అంటూ తమ ప్రకటనను ముగించి, సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచారు. బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ’ భారీ విజయం సాధించడంతో, దాని సీక్వెల్‌పై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది. 
Nandamuri Balakrishna
Akhanda 2
Boyapati Srinu
Akhanda sequel
Telugu movies
movie release date
delay announcement
visual effects
theatrical experience
Tollywood

More Telugu News