Ravichandran Ashwin: 'ది హండ్రెడ్' లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా అశ్విన్!

Ravichandran Ashwin to Play in The Hundred League
  • ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్
  • ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌లలో ఆడతానని వెల్లడి
  • ఇంగ్లండ్‌కు చెందిన 'ది హండ్రెడ్' లీగ్‌లో ఆడేందుకు ఆసక్తి
  • ఈ లీగ్‌లో ఆడిన తొలి భారత ఆటగాడిగా నిలిచే అవకాశం
  • ఐపీఎల్‌లో 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు తీసిన అశ్విన్
ఐపీఎల్ నుంచి తప్పుకున్న టీమిండియా వెటరన్ స్పిన్నర్, సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డుపై కన్నేశాడు. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇంగ్లండ్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక 'ది హండ్రెడ్' ఫ్రాంచైజీ లీగ్‌లో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే, ఈ లీగ్‌లో అడుగుపెట్టిన తొలి భారత క్రికెటర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టిస్తాడు.

బుధవారం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించిన అశ్విన్ ప్రపంచంలోని వివిధ లీగ్‌లలో ఒక ఆటగాడిగా తన కొత్త ప్రయాణం మొదలవుతుందని పేర్కొన్నాడు.'ది టెలిగ్రాఫ్' పత్రిక నివేదిక ప్రకారం 38 ఏళ్ల అశ్విన్ వచ్చే ఏడాది నుంచి 'ది హండ్రెడ్' టోర్నమెంట్‌లో పాల్గొనాలని భావిస్తున్నాడు.  

రవిచంద్రన్ అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి ఐదు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 221 మ్యాచ్‌లు ఆడి, 7.20 ఎకానమీ రేటుతో 187 వికెట్లు పడగొట్టాడు. 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అశ్విన్‌ను ఆ జట్టు రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.
Ravichandran Ashwin
The Hundred
The Hundred League
Indian Cricketer
IPL
England Cricket
Franchise League
Cricket Tournament
Twenty20

More Telugu News