బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఏపీఎస్‌డీఎంఏ అలర్ట్
- బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. భారీ వర్ష సూచన
- తీవ్ర అల్పపీడనం ఒడిశా మీదుగా పయనించే అవకాశం
- వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తగా ఉండాలని సూచన
వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం, అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారిందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని, రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.