Lakshmi Menon: ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన నటి లక్ష్మీ మీనన్‌.. ముగ్గురి అరెస్ట్, నటి పరారీ

Actress Lakshmi Menon Faces Kidnapping Charges in Kochi
  • కొచ్చిలో ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన లక్ష్మీ మీనన్ బృందం
  • తమ కారులోకి ఎక్కించుకుని దాడి చేసిన వైనం
  • ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్న లక్ష్మీ మీనన్
ప్రముఖ తమిళ నటి, 'చంద్రముఖి 2', 'ఇంద్రుడు', 'కుంకి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన లక్ష్మీ మీనన్ తీవ్రమైన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. కేరళలోని కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేశారన్న కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో లక్ష్మీ మీనన్ ప్రధాన నిందితురాలిగా ఉండగా, ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొచ్చిలోని ఓ రెస్టారెంట్ బార్‌లో బాధితుడి స్నేహితుడితో లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులకు మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది. ఆ గొడవ అక్కడితో ఆగలేదు. బార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లక్ష్మీ మీనన్ బృందం బాధితుడిని వెంబడించి, అతని కారును అడ్డగించింది. అనంతరం అతడిని బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించుకుని దాడికి పాల్పడ్డారని బాధితుడు తన ఫిర్యాదులో ఆరోపించారు.

బాధితుడి ఫిర్యాదు స్వీకరించిన ఎర్నాకులం నార్త్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి లక్ష్మీ మీనన్ స్నేహితులైన మిథున్, అనీశ్, సోనామోల్‌లను అరెస్ట్ చేశారు. అయితే, ప్రధాన నిందితురాలైన లక్ష్మీ మీనన్ పరారీలో ఉందని, ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమెను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.

'కుంకి', 'జిగర్తాండ', 'వేదాలం' వంటి విజయవంతమైన తమిళ చిత్రాలతో లక్ష్మీ మీనన్ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విశాల్ సరసన నటించిన 'ఇంద్రుడు' సినిమాతో తెలుగులోనూ ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అలాంటి నటి కిడ్నాప్ కేసులో చిక్కుకోవడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. 
Lakshmi Menon
Lakshmi Menon kidnap case
Kerala kidnap
Chandramukhi 2 actress
IT employee kidnap
Kochi crime
Tamil actress scandal
Indrudu movie
arrests
Ernakulam police

More Telugu News