Tirumala: తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం

  • తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైన కారు 
  • పలువురు భక్తులకు గాయాలు
  • బస్సును ఓవర్ టేక్ చేస్తూ అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న కారు
  • ఘాట్ రోడ్డులో ఏడో మైలు రాయి వద్ద ఘటన
తిరుమల ఘాట్ రోడ్డులో వాహన చోదకుల అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా శ్రీవారి దర్శనానికి బయలుదేరిన కొందరు భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తిరుమల ఘాట్ రోడ్డులోని ఏడో మైలు రాయి వద్ద ఒక కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నవారికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఘాట్ రోడ్డులో వాహన చోదకులకు పోలీసులు సూచనలు జారీ చేశారు. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తులు ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని సూచిస్తున్నారు. ఘాట్ రోడ్డులో ముందు వెళ్లే వాహనాలను ఓవర్ టేక్ చేయడం వంటివి చేయవద్దని పోలీసులు చెబుతున్నారు. 
Tirumala
Tirumala ghat road
Road accident
Andhra Pradesh
Traffic
Pilgrims
Overtake
Car accident
TTD
Tirupati

More Telugu News