Rajamouli: థియేటర్లలో మాత్రమే ఆ ఎఫెక్ట్ వస్తుంది: రాజమౌళి

Rajamouli says theater experience is unique
  • మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 సినిమాపై భారీ అంచనాలు
  • మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా నవంబర్‌లో ఫస్ట్‌లుక్‌ విడుదల 
  • థియేటర్ అనుభవానికి ప్రత్యామ్నాయం లేదన్న రాజమౌళి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 సినిమా ప్రస్తుతం భారతీయ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను నెలకొల్పుతోంది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక పాన్ ఇండియా అడ్వెంచర్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.

ఇప్పటికే పలు అంతర్జాతీయ లొకేషన్లలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జంగిల్ ఎక్స్‌ప్లోరర్ నేపథ్యంలో సాగనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు పోషించే పాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించే అవకాశం ఉందని చిత్ర బృందం చెబుతోంది.

ఫస్ట్‌లుక్ నవంబరులో విడుదల

మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా, 2025 నవంబర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు అధికారిక సమాచారం. దీంతో అభిమానులు ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టైటిల్‌పై ఉత్కంఠ

ఈ సినిమాకు "గ్లోబ్‌ట్రాటర్" అనే టైటిల్ ఖరారవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, "Gen 63" అనే మరో ఆసక్తికరమైన టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతోంది.

OTTల హవా.. కానీ థియేటర్ అనుభవం వేరు!

ఇటీవలి కాలంలో OTT వేదికలు సినిమాలను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. సౌకర్యవంతమైన వీక్షణం, విభిన్న భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉండటం వంటివి ప్రధాన కారణంగా ప్రేక్షకులు థియేటర్ కంటే OTTలపై ఆసక్తి చూపుతున్నారు. అయితే, థియేటర్ అనుభవానికి ప్రత్యామ్నాయం లేదని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి గుర్తు చేశారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. "రజనీకాంత్ లేదా సల్మాన్ ఖాన్ ఓపెనింగ్ సీన్‌లో కనిపించినప్పుడు థియేటర్‌లో జనాలు ఎలా స్పందిస్తారో, అదే OTTలో అనుభవించలేం. ఇది థియేటర్ ప్రత్యేక అనుభవం" అని పేర్కొన్నారు. ఓపెనింగ్ షాట్‌లో హీరోలు రింగ్‌లోకి వచ్చి బాడీ చూపించడంతో థియేటర్లలో అభిమానులు ఆ సీన్ చూసి కేకలు వేస్తారు. విజిల్స్ వేస్తారు. పేపర్లు ఎగరేస్తారని, కానీ అదే సీన్ OTTలో చూసినప్పుడు ఆ అనుభూతి రాదని రాజమౌళి అన్నారు. 
Rajamouli
SSMB29
Mahesh Babu
Telugu cinema
Indian cinema
OTT platforms
Theater experience
Pan India movie
Globe trotter
Gen 63

More Telugu News