Pawan Kalyan: మట్టి వినాయకుడిని పూజించండి... పర్యావరణాన్ని కాపాడండి: పవన్ కల్యాణ్

Pawan Kalyan Greets People on Vinayaka Chavithi
  • గణనాధుని భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
  • వినాయక చవితిని ప్రపంచంలోని హిందువులంతా ఒక్కటిగా జరుపుకుంటారన్న పవన్ కల్యాణ్
  • ప్రజల శుభ కార్యక్రమాలకు విఘ్నాలు కలగకకుండా చూడాలని ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నానన్న పవన్ కల్యాణ్
వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వినాయక చవితి విశిష్టతను వివరించారు.

హైందవ పండుగలలో కొన్నింటిని కొన్ని ప్రాంతాల్లోనే నిర్వహించుకుంటారని, కానీ వినాయక చవితిని మాత్రం ప్రపంచంలోని హిందువులంతా ఒక్కటిగా జరుపుకుంటారని ఆయన అన్నారు. అంతటి విశిష్టమైన ఈ పండుగ సందర్భంగా గణనాథుని భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

గణాలకు అధిపతి లంబోదరుడని, ప్రజలు తలపెట్టే అన్ని శుభ కార్యక్రమాలకు విఘ్నాలు కలగకుండా చూడాలని ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఎప్పటిలాగే ఒక విన్నపం చేస్తూ మట్టి వినాయకుడిని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. 
Pawan Kalyan
Ganesh Chaturthi
Vinayaka Chavithi
Andhra Pradesh
Environmental Protection
Clay Ganesha
Hindu Festival
Prayers
Festival Greetings

More Telugu News