Perni Nani: పేర్ని నానిపై కేసు నమోదు
- ఏలూరు త్రీటౌన్ పీఎస్ లో కేసు నమోదు
- పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని
- పేర్ని నాని వ్యాఖ్యలను ఖండించిన నూజివీడు డీఎస్పీ
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దెందులూరు నియోజకవర్గంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వంటి ఘటనలకు సంబంధించి కేసు నమోదు చేశారు. మరోవైపు పోలీసులపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను నూజివీడు డీఎస్పీ ఖండించారు.