Telangana Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల

Telangana Panchayat Elections Voter List Revision Schedule Released
  • ఈ నెల 28న పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల
  • 29న జిల్లా స్థాయి, 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం
  • సెప్టెంబర్ 2న తుది జాబితా విడుదల
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) విడుదల చేసింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.

పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. ఈ నెల 29న జిల్లా స్థాయిలో, 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. ఓటరు జాబితాపై ఈ నెల 28 నుంచి 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి, సెప్టెంబర్ 2న తుది జాబితాను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.
Telangana Panchayat Elections
Telangana Elections
Panchayat Elections
Telangana SEC

More Telugu News