Chandrababu Naidu: ఈటీవీకి 30 ఏళ్లు... విషెస్ తెలిపిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Wishes ETV on 30th Anniversary
  • 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీ
  • ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
  • తెలుగు భాష, సంస్కృతికి ఈటీవీ పెద్దపీట వేస్తోందని ప్రశంస
  • ఈటీవీ రాత్రి 9 గంటల వార్తలకు తిరుగులేదన్న ముఖ్యమంత్రి
  • రామోజీరావు ఆశయాలను ఛానల్ కొనసాగిస్తోందని కితాబు
  • మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
ప్రముఖ వినోద ఛానల్ ఈటీవీ మూడు దశాబ్దాల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఛానల్ యాజమాన్యానికి, ఉద్యోగులకు, మరియు ఇతర సిబ్బందికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 

తెలుగింటి ఛానల్ ఈటీవీ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన ఛానల్ యాజమాన్యానికి, ఉద్యోగులకు, సిబ్బందికి నా శుభాకాంక్షలు. ఈటీవీ-మీటీవీ అంటూ తెలుగు ప్రజలకు ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచుతూ... మూడు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. తెలుగు భాషకు, మన సంస్కృతి సాంప్రదాయాలకు, పండుగలు, కట్టుబాట్లకు పెద్దపీట వేస్తూ.. అన్ని వర్గాల ప్రజలను అలరించే కార్యక్రమాలను అందించడంలో ఈటీవీకి మరేదీ సాటి లేదు. పాడుతా తీయగా వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. 

ఎన్ని 24 గంటల న్యూస్ ఛానల్స్ వచ్చినా ఈటీవీ 9 పీఎం న్యూస్ బులెటిన్ తెలుగునాట ఇప్పటికీ నెంబర్‌-1గానే నిలుస్తుంది. 9 గంటల బులెటిన్ చూస్తే చాలు... రోజంతా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అనే విధంగా ఒక బ్రాండ్‌ని సృష్టించుకుంది. 

రామోజీరావు గారి ఆశయాలను, ఆలోచనలను, విలువలను కొనసాగిస్తూ... నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది కృషితో ఈటీవీ ఉన్నత స్థాయికి ఎదిగింది. సరికొత్త ఉత్సాహంతో, టీమ్‌ వర్క్‌తో...ఈటీవీ ప్రయాణం మరింత విజయవంతం అవ్వాలని, ప్రజలను అలరించాలని కోరుకుంటున్నాను" అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 
Chandrababu Naidu
ETV
ETV Telugu
Ramoji Rao
Telugu News
Telugu Culture
Andhra Pradesh
Padutha Theeyaga
ETV 9 PM News
Telugu Entertainment

More Telugu News