Nagalakshmi: నిర్మల్‌లో ఘోరం... ప్రియుడి మోజులో భర్తను చంపేసిన భార్య

Nagalakshmi Kills Husband in Nirmal with Lovers Help
  • సోన్ మండలంలోని వెల్మల్ గ్రామంలో ఘటన
  • మూర్చ కారణంగా మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం
  • గల్ఫ్ నుంచి వచ్చిన కుమారుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు
  • విచారణలో నేరాన్ని అంగీకరించిన భార్య, ప్రియుడు
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, సోన్ మండలంలోని వెల్మల్‌లో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. భర్త మూర్ఛతో మరణించాడని ఆమె నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, కుమారుడికి అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హరిచరణ్, నాగలక్ష్మి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాగలక్ష్మికి మహేశ్ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. తమకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన నాగలక్ష్మి అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది.

మంగళవారం మహేశ్‌ను ఇంటికి పిలిపించి, హరిచరణ్‌ను బంధించి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం, హరిచరణ్ బాత్రూంలో మూర్ఛ కారణంగా చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. మూడు రోజుల తర్వాత వారి కుమారుడు గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడు. తాను రాకముందే తండ్రి అంత్యక్రియలు జరపడంపై అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి ప్రవర్తనపై అనుమానం రావడంతో కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. నాగలక్ష్మిని, మహేశ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా, వారు నేరాన్ని అంగీకరించారు.
Nagalakshmi
Nirmal murder
Telangana crime
Extramarital affair
Husband killed
Velmal village

More Telugu News