PV Sunil Kumar: ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌ పొడిగింపు

PV Sunil Kumar Suspension Extended by AP Government
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు సస్పెన్షన్ కొనసాగిస్తూ ఉత్తర్వులు
  • అగ్రిగోల్డ్, రఘురామరాజు కేసుల్లో విచారణే ప్రధాన కారణం
  • దర్యాప్తును ప్రభావితం చేస్తారని రివ్యూ కమిటీ ఆందోళన
సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఆయన సస్పెన్షన్‌ను వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరి 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న ఆరోపణలు రుజువు కావడంతో సునీల్ కుమార్‌ను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో, రివ్యూ కమిటీ దీనిపై సమీక్ష నిర్వహించింది.

సునీల్ కుమార్‌పై అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏసీబీ విచారణ కొనసాగుతోందని, అదే సమయంలో గతంలో ఎంపీగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో గుంటూరు నగరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. ఈ కేసులు కీలక దశలో ఉన్నందున, ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేస్తే సునీల్ కుమార్ సాక్ష్యాధారాలను తారుమారు చేయడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం సస్పెన్షన్‌ను పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు, తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. 
PV Sunil Kumar
IPS officer
AP government
suspension extended
Agrigold scam
Raghurama Krishna Raju
ACB investigation
Andhra Pradesh
police investigation

More Telugu News