Viraj Sheth: ఆసక్తికర జాబ్ నోటిఫికేషన్... స్క్రోలింగ్ చేయడమే ప్రధాన అర్హత!

Viraj Sheth Announces Doom Scroller Job at Monk Entertainment
  • సోషల్ మీడియాలో మాంక్ ఎంటర్‌టైన్‌మెంట్ కో ఫౌండర్ విరాజ్ శేత్ పోస్ట్ వైరల్
  • డూమ్ స్క్రోలర్ పేరుతో ఉద్యోగ ప్రకటన
  • సోషల్ మీడియాలో గంటల తరబడి గడిపే యువతకు గుడ్ న్యూస్
సోషల్ మీడియాలో గంటల తరబడి స్క్రోల్ చేస్తూ గడిపే యువతకు ఇది ఓ శుభవార్త. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటివాటిలో ఎక్కువ సమయం గడిపే వాళ్లకోసం ప్రత్యేకంగా ఒక ఉద్యోగ ప్రకటన విడుదలైంది. మాంక్ ఎంటర్‌టైన్‌మెంట్ కో-ఫౌండర్ మరియు సీఈఓ విరాజ్ శేత్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఈ ఉద్యోగానికి ‘డూమ్-స్క్రోలర్’ అనే పేరు పెట్టారు. రోజు కనీసం ఆరు గంటలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో స్క్రోల్ చేసే నైపుణ్యం ఉండాలి. కేవలం అలవాటుగా కాకుండా, ట్రెండ్స్‌ను అర్థం చేసుకునే దక్షత ఉండాలని విరాజ్ శేత్ పేర్కొన్నారు.
 
అర్హతలు:

హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నైపుణ్యం తప్పనిసరి
సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ పట్ల ఆసక్తి మరియు అవగాహన
క్రియేటర్ కల్చర్ పట్ల అంకితభావం
మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌ వాడగలగాలి
ఉద్యోగం ముంబైలో ఉంటుంది; ఫుల్ టైం విధానంలో పనిచేయాలి

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. "ఇన్‌స్టాలో సమయం వృధా చేస్తున్నాననుకున్నా, ఇప్పుడు అదే స్కిల్!" అంటూ కొందరు కామెంట్ చేయగా, "నేను 19 గంటలు స్క్రోల్ చేస్తా, ఈ ఉద్యోగానికి పర్ఫెక్ట్ కాదా?" అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. ఇంకొందరు అయితే "ఇది మా అమ్మకి చూపించాలి, స్క్రోలింగ్ కూడా ప్రొఫెషన్ అవుతుంది!" అంటూ సరదాగా రిప్లై ఇస్తున్నారు.
Viraj Sheth
Monk Entertainment
Doom Scroller
social media job
scrolling job
Instagram job
YouTube job
Mumbai job
social media trends

More Telugu News