Vijay Deverakonda: ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'

Vijay Deverakonda Kingdom movie OTT release on Netflix
  • విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ఓటీటీ విడుదల ఖరారు
  • ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
  • ఈ నెల 27వ తేదీ నుంచి అందుబాటులోకి
  • గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఈ నెల ఆగస్టు 27వ తేదీ నుంచి ‘కింగ్డమ్’ తమ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. జులై 31న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, నెల రోజులు పూర్తి కాకముందే ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులు, అభిమానులు ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం లభించింది.

‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. ఆయన అన్నయ్య శివ పాత్రలో ప్రముఖ నటుడు సత్యదేవ్ నటించగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. 
Vijay Deverakonda
Kingdom movie
Vijay Deverakonda Kingdom
Netflix
Gowtam Tinnanuri
Jersey movie director
Satyadev
Bhagyashri Borse
Telugu movies
OTT release

More Telugu News