పవన్ కల్యాణ్ చేతిపై ఉన్న టాటూకు అర్థం ఇదేనంట!
- పవన్ 'ఓజీ' సినిమా నుంచి రెండో పాట విడుదలకు రంగం సిద్ధం
- పవన్, ప్రియాంక మోహన్‌పై రొమాంటిక్ పోస్టర్ విడుదల
- పోస్టర్‌లో పవన్ కుడి చేతిపై కనిపించిన జపనీస్ టాటూ
- ఆ మూడు పదాల అర్థంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ
- వాగ్దానం, బలం, నిప్పు అనే అర్థాలుగా ప్రచారం
దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి రెండో పాటకు సంబంధించిన పోస్టర్‌లో పవన్ కల్యాణ్, హీరోయిన్ ప్రియాంక మోహన్ రొమాంటిక్ లుక్‌లో కనిపించారు. దీపాల వెలుగులో వారిద్దరూ ఎంతో ప్రకాశవంతంగా ఉన్నారు. అయితే, అభిమానుల దృష్టి మొత్తం పవన్ కుడి చేతిపై ఉన్న ఒక టాటూపై పడింది. జపనీస్ భాషలో మూడు అక్షరాలతో ఉన్న ఆ టాటూ అర్థం ఏమిటని అందరూ ఆసక్తిగా వెతకడం ప్రారంభించారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఆ మూడు జపనీస్ అక్షరాలకు శక్తివంతమైన అర్థాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో మొదటి అక్షరానికి 'ప్రామిస్' (వాగ్దానం), రెండో అక్షరానికి 'స్ట్రెంగ్త్' (బలం), మూడో అక్షరానికి 'ఫైర్' (నిప్పు) అని అర్థం వస్తుందని అంటున్నారు. ఈ మూడు పదాలు సినిమాలో పవన్ పాత్ర స్వభావాన్ని, ఆయన లక్ష్యాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గ్లింప్స్, మొదటి పాటతో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన 'ఓజీ'పై ఈ టాటూ ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచింది.