Bapatla Theft: బాపట్ల జిల్లాలో భారీ చోరీ... కంటైనర్ లారీ నుంచి 255 ల్యాప్ టాప్ లు మాయం!

Bapatla District Huge Theft 255 Laptops Stolen From Container Lorry
  • బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద ఘటన
  • ముంబయి నుంచి చెన్నైకి నాలుగు కంటైనర్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు తరలిస్తుండగా చోరీ
  • చోరీకి గురైన ల్యాప్‌టాప్‌ల విలువ రూ.1.85 కోట్లు ఉంటుందన్న కంపెనీ ప్రతినిధులు
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద జరిగిన భారీ చోరీ ఘటన వ్యాపార వర్గాలలో ఆందోళన కలిగిస్తోంది. ముంబయి నుంచి చెన్నైకి ఒక కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను నాలుగు కంటైనర్లలో తరలిస్తుండగా, ఒక కంటైనర్‌లోని 255 ల్యాప్‌టాప్‌లను దుండగులు చాకచక్యంగా అపహరించారు.

ఈ క్రమంలో అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్ద కంటెయినర్ అలారం బ్రేక్ అయినట్లు కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందింది. ఈ ఘటన శనివారం జరగగా, కంపెనీ ప్రతినిధులు వెంటనే స్పందించారు. అయితే అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు.

దీనిపై నిన్న మేదరమెట్ల పోలీస్‌స్టేషన్‌లో కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై చీరాల డీఎస్పీ మొయిన్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చోరీకి గురైన ల్యాప్‌టాప్‌ల విలువ సుమారు రూ.1.85 కోట్లు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 
Bapatla Theft
Bapatla district
Laptop theft
Container lorry
Cybercrime
Andhra Pradesh police
Cheerala DSP
Electronic goods
Mumbai to Chennai
Medarametla

More Telugu News