Chandrababu Naidu: నేనంటే సుధాకర్ రెడ్డికి ప్రత్యేక అభిమానం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Sudhakar Reddy Had Special Affection for Me
  • సీపీఐ నేత సురవరం భౌతిక కాయానికి  సీఎం చంద్రబాబు నివాళి
  • హైదరాబాద్ మఖ్దూం భవన్‌లో పార్థివ దేహానికి పుష్పాంజలి
  • సురవరంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం
  • ప్రజాహితం కోసం ఎన్నో పోరాటాలు కలిసి చేశామన్న చంద్రబాబు
  • ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటని వ్యాఖ్య
  • సురవరం పోరాట వారసత్వాన్ని మనకు ఇచ్చిపోయారని వెల్లడి
సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డితో తనకు ఎంతో కాలంగా రాజకీయ అనుబంధం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటాలు మరువలేనివని కొనియాడారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో ఉంచిన సురవరం పార్థివ దేహానికి చంద్రబాబు పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం ఆయనతో తనకున్న జ్ఞాపకాలను అక్కడి నేతలతో పంచుకున్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకోసం సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి పోరాడారని చంద్రబాబు అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.

"సురవరంతో నాకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. సుధాకర్ రెడ్డి, నేను కలిసి ఎన్నో రాజకీయ పోరాటాలు చేశాం. నిత్యం ప్రజాహితం కోసం కలిసి పోరాడాం. ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజలకు సేవలందించారు. సుధాకర్ రెడ్డి నన్ను ప్రత్యేకంగా అభిమానించేవారు. నేను చేసే పనుల్ని, కార్యక్రమాల్ని అభినందించి ప్రోత్సహించేవారు. ఆయన సేవల్నీ, పోరాటాలను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. సుధాకర్ రెడ్డి చనిపోయినా పోరాట వారసత్వాన్ని మనకు ఇచ్చిపోయారు. సుధాకర్ రెడ్డి మరణం సీపీఐతో పాటు, తెలుగు వారికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా" అని సీఎం చంద్రబాబు అన్నారు.

Chandrababu Naidu
Suravaram Sudhakar Reddy
CPI
Andhra Pradesh
Political leader
Communist Party of India
Political journey
Condolences
Telangana
Makdhoom Bhavan

More Telugu News