పంజాబ్ లో పేలిన గ్యాస్ ట్యాంకర్.. ఏడుగురు దుర్మరణం
- ట్రక్కును ఢీ కొట్టడంతో పేలుడు
- భారీగా ఎగిసిపడ్డ మంటలు
- ఘటనా స్థలంలోనే ఇద్దరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృతి
ఈ ప్రమాదంపై డిప్యూటీ కమిషనర్ ఆషికా జైన్ స్పందిస్తూ.. ప్రమాద సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందించామన్నారు. ఘటనాస్థలానికి అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు మరియు పంజాబ్ పోలీసులు చేరుకుని బాధితులకు సాయం అందించారు. గాయపడిన వారిని అంబులెన్స్ లలో సమీప ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. ట్రక్కును ఢీ కొట్టడంతో ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయిందని, దీంతో పేలుడు సంభవించిందని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పంజాబ్ మంత్రి రవ్‌జోత్ సింగ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.