Ashish Gupta: రైలులో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. వీడియో ఇదిగో!

GRP Constable Ashish Gupta Molests Woman on Train
  • నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన వైనం
  • చీకట్లో ఎవరూ గుర్తించలేరనే ధైర్యంతో నిర్వాకం
  • చేతిని పట్టేసుకుని నిలదీసిన మహిళ.. దండం పెడుతూ కానిస్టేబుల్ వేడుకోలు
రైలు ప్రయాణంలో మహిళల రక్షణ కోసం డ్యూటీ చేస్తున్న ఓ కానిస్టేబుల్ తానే ఓ మహిళను వేధించాడు. రక్షించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తే అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. కోచ్ లో చీకటిగా ఉండడంతో తన చర్యలను ఎవరూ గమనించలేరనే ఉద్దేశంతో ఈ పాడుపనికి పాల్పడ్డాడు. అయితే, నిద్ర నుంచి మేల్కొన్న ఆ మహిళ తనను తాకిన చేయిని గట్టిగా పట్టుకుంది. కళ్లు తెరిచి చూడగా కానిస్టేబుల్ కనిపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌ రాజ్ వెళ్తున్న ట్రెయిన్‌లో మహిళల భద్రతను కాపాడాల్సిన జీఆర్‌పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా దారుణంగా ప్రవర్తించాడు. రాత్రివేళలో లైట్లు ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను, నిద్రలో ఉన్న ఓ మహిళను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. యువతి నిద్రలేచి పట్టుకోవడంతో క్షమించాలని వేడుకున్నాడు. మహిళ ఫిర్యాదుతో ఉన్నతాధికారులు స్పందించి ఆశిష్ గుప్తాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ashish Gupta
Ashish Gupta GRP Constable
Delhi Prayagraj Train
Train Molestation
Women Safety
GRP Constable Suspended
Sexual Harassment
Crime News India

More Telugu News