Ganesh idol: పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద ఇరుక్కున్న గణేశుడి విగ్రహం.. వీడియో ఇదిగో!
––
వినాయక చవితి సందర్భంగా గణనాథుడి భారీ విగ్రహాన్ని తరలిస్తుండగా ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన ఘటన పంజాగుట్టలో చోటుచేసుకుంది. విగ్రహం ఎత్తును సరిగా అంచనా వేయలేకపోవడంతో ఈ ఘటన జరిగింది. దీంతో పంజాగుట్టలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతాబాద్ నుంచి భారీ వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తున్న డీసీఎం ఫ్లైఓవర్ కింద ఆగిపోయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించి డీసీఎంను వేరే మార్గంలో పంపించారు. వినాయక మంటపాల నిర్వాహకులు విగ్రహం ఎత్తును బట్టి ముందస్తుగానే రూట్ ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.