Vipin: భార్యను చంపి.. 'నన్ను హంతకుడంటున్నారు' అంటూ భర్త ఇన్‌స్టా పోస్ట్!

Vipin Arrested for Wifes Murder Posts Instagram Claiming Innocence
  • గ్రేటర్ నోయిడాలో భార్యకు నిప్పంటించి చంపిన భర్త
  • అరెస్టుకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో వింత పోస్టులు
  • ఆమె ఆత్మహత్య చేసుకుందని, తనను హంతకుడంటున్నారని ఆవేదన
  • వరకట్నం కోసం వేధించారని మృతురాలి సోదరి ఆరోపణ
  • కళ్ల ముందే నిప్పంటించారని కన్నకొడుకు వాంగ్మూలం
  • భర్త విపిన్‌తో పాటు అత్తమామలపైనా కేసు నమోదు
కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా నిప్పంటించి హత్య చేసిన ఓ భర్త, ఏమీ తెలియనట్టు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. భార్య ఆత్మహత్య చేసుకుందని, ఆమె వెళ్లిపోయాక ప్రపంచం తనను హంతకుడిలా చూస్తోందంటూ అతడు పెట్టిన పోస్టులు చూసి అందరూ నివ్వెరపోతున్నారు. ఈ దారుణ ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలోని సిర్సాలో చోటుచేసుకుంది.

విపిన్ అనే వ్యక్తి తన భార్య నిక్కీని తీవ్రంగా కొడుతున్న వీడియోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఆ తర్వాత తీవ్రమైన కాలిన గాయాలతో నిక్కీ గురువారం ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఈ హత్య కేసులో అరెస్ట్ కావడానికి కొన్ని గంటల ముందు, నిందితుడైన విపిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన విపిన్ "ఏం జరిగిందో నాతో ఎందుకు చెప్పలేదు? నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు? ప్రపంచం నన్ను హంతకుడంటోంది నిక్కీ" అంటూ హిందీ పాట నేపథ్యంతో ఒక పోస్ట్ పెట్టాడు. "నువ్వు వెళ్ళిపోయాక నాకు చాలా అన్యాయం జరుగుతోంది" అని కూడా రాసుకొచ్చాడు. మరో పోస్టులో భార్యాబిడ్డలతో సంతోషంగా ఉన్న వీడియో పెట్టి "నేను సర్వనాశనమైపోయాను" అని క్యాప్షన్ జోడించాడు.

మరోవైపు, నిక్కీని ఆమె భర్త, అత్తమామలే హత్య చేశారని ఆమె సోదరి కంచన్ ఆరోపిస్తున్నారు. కంచన్‌ను విపిన్ అన్నయ్యకే ఇచ్చి వివాహం చేశారు. 2016లో పెళ్లి అయినప్పటి నుంచి తమ ఇద్దరినీ వరకట్నం కోసం వేధిస్తున్నారని, రూ. 36 లక్షలు తీసుకురావాలని ఒత్తిడి చేశారని కంచన్ తెలిపారు. "గురువారం నా కళ్ల ముందే నా సోదరిపై దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత ఆమెపై ఏదో ద్రావణం పోసి నిప్పంటించారు. నేను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నాకు న్యాయం కావాలి" అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

నిక్కీ కుమారుడు కూడా తన తల్లిని కొట్టి, లైటర్‌తో నిప్పంటించారని పోలీసులకు చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విపిన్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అతని తల్లిదండ్రులు, సోదరుడి కోసం గాలిస్తున్నారు.
Vipin
Nikki murder case
Greater Noida crime
dowry harassment
domestic violence India
Sirsa murder
social media post
crime news
Kanchan sister
Vipin arrest

More Telugu News