Srisailam Dam: కృష్ణానదికి కొనసాగుతున్న వరద ప్రవాహం .. శ్రీశైలం డ్యామ్ వద్ద నేటి పరిస్థితి ఇలా..

Srisailam Dam Steady Flood Flow Continues
  • శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 4,71,386 క్యూసెక్కులు
  • ఔట్ ఫ్లో 5,05,150 క్యూసెక్కులు
  • 881.50 అడుగులకు చేరిన నీటిమట్టం
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,71,386 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో ఉండగా, 5,05,150 క్యూసెక్కులుగా ఔట్‌ఫ్లో నమోదైంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నీటి విడుదల వివరాలు ఇలా ఉన్నాయి:

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్ ద్వారా: 30,000 క్యూసెక్కులు
ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా: 35,315 క్యూసెక్కులు
కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా: 21,775 క్యూసెక్కులు
స్పిల్‌వే గేట్లు (10) ద్వారా: గేట్లను 18 అడుగుల మేర ఎత్తి, 4,18,060 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల

ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో:

నీటిమట్టం: 881.50 అడుగులు (పూర్తి స్థాయి – 885 అడుగులు)
నీటి నిల్వ సామర్థ్యం: 215.80 టీఎంసీలు
ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు: 196.11 టీఎంసీలు 
Srisailam Dam
Krishna River
Srisailam reservoir
flood flow
water release
Jurala project
Telangana
Andhra Pradesh

More Telugu News